MBNR: జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్కు రాకుండానే, తమ ఇంటి నుండే ఫిర్యాదు చేసేలా “హోమ్ ఎఫ్.ఐ.ఆర్” విధానాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల సౌకర్యార్థం పోలీసులు నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించి, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తారు. తక్షణమే ఫిర్యాదు కాపీని కూడా అందజేస్తారు.