SDPT: ఫొటోలు పెట్టుకోవడం వల్ల పేరు రాదని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఇంట్లో మోదీ ఫొటో ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం చెక్కు చెదరదన్నారు. రాజకీయాల కంటే ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నిజాన్ని గుర్తిస్తారని అన్నారు.