బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు నోట్ రావడం కలకలం రేపింది. కొద్దిసేపట్లో విమానం టేకాఫ్ అవ్వబోతున్న సమయంలో విమానంలోని వాష్ రూమ్లో ఒక టిష్యూపై ఉన్న బాంబు బెదిరింపు నోటును సిబ్బంది చూశారు. వెంటనే అప్రమత్తమై అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను కిందకు దింపి విమానమంతా తనిఖీలు చేసిన అధికారులు ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేల్చారు.