ADB: నిర్మల్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు ఇవాళ ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ హెచ్చరిక జారీ చేసింది. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ, ప్రత్యేక ఉద్యోగ నోటిఫికేషన్, రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిమాండ్ చేసింది. డిమాండ్లు నెరవేర్చకపోతే రేపు నిర్మల్లో జరిగే సభను అడ్డుకుంటామని ప్రధాన కార్యదర్శి జాదవ్ సుమేష్ తెలిపారు.