BHNG: మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆదివారం మిన్నంటాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సామెల్, చైర్పర్సన్ గడ్డం స్వప్న పాల్గొన్నారు. యువజన సంఘాల ఆధ్వర్యంలో బాబుజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.