MDK: జిల్లాలో BJP ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ పేర్కొన్నారు. తూప్రాన్ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఇంటింటా జండావిష్కరణ చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో విజయం దిశగా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.