AP: మంత్రి పదవి దక్కలేదని తనకు అసంతృప్తి లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ తెలిపారు. ‘డిప్యూటీ స్పీకర్ పదవితో సంతోషంగానే ఉన్నా. ఆకివీడు రామాలయం డంపింగ్ యార్డుగా మారిందని తెలిసింది. ఆలయాన్ని శుభ్రం చేయాలని అనుచరులకు సూచించా. గొడవ అవుతోందని ఆలయం దగ్గరకు వెళ్లా. రెవెన్యూ రికార్డుల్లో రామాలయం ఉన్నట్లు స్పష్టమైంది. అందుకే రామాలయాన్ని పునర్నిర్మిస్తామని చెప్పా’ అని పేర్కొన్నారు.