SRH, లక్నో సూపర్జెయింట్స్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం కనిపిస్తోంది. మ.3.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ సమయంలో, వర్షం పడే అవకాశం 50 శాతంగా ఉన్నట్లు వెదర్ రిపోర్ట్ చెబుతోంది. SRH సొంత గడ్డపై ఆడుతున్న తొలి మ్యాచ్ కావడంతో ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది.