SDPT: గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా జరిగిన ఈ ఘటనను ఏ విధంగానూ సహించబోమని స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.