ప్రకాశం: స్థానిక కలెక్టరేట్లో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు తదితరులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి, దళితుల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడని అన్నారు.