NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఛైర్పర్సన్ బృంగి రత్నమాల అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డులో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆమె ఆదివారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ కుమార్, కౌన్సిలర్స్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.