హైదరాబాద్ నగరంలోని లచ్చమ్మ కుంటను బడాబాబులు కబ్జా చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. కేవలం పేదలను మాత్రమే అరెస్ట్ చేస్తారా..? బడాబాబులను ముట్టుకోవడానికి భయమా..? అని నిలదీశారు.