WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని కోనారెడ్డి చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ తల్లి ఆలయంలో పునరుప్రతిష్ట కార్యక్రమానికి ముహూర్తం నిర్ణయించారు. ఆదివారం ఆలయ పూజారి రాణాప్రతాప్ను కలిసి ముహూర్తం ఖరారు చేశారు. మే నెలలో 7, 8 తేదీలలో శుభ ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.