TG: యాదాద్రి, పెద్దపల్లి జిల్లాల్లో ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష జరపనున్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరగాలని సూచించనున్నారు. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో తాలు, తరుగు పేరుతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించనున్నారు.