PDPL: గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్ధమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. పీసీఎన్డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటి చట్టవిరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.