E.G: రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత బిల్లును స్వాగతిస్తూ ఆదివారం రాజమండ్రిలోని నగర టీడీపీ కార్యాలయం వద్ద ‘మన రాజధాని – మన అమరావతి’ అంటూ తెలుగు మహిళలు రంగవల్లులు వేశారు. వాటిని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్టీ నాయకులతో కలిసి తిలకించారు. ప్రజా రాజధానికి న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు.