AP: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు. దేశంలో వ్యవసాయాన్ని ఆధునీకరించటంతో పాటు ఆహార సంక్షోభ సమయంలో దేశాన్ని గట్టెక్కించారని, పారిశ్రామిక వివాదాల చట్టం, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి ఎన్నో సంస్కరణలు అమలు చేశారని వివరించారు.