మనం రోజువారీ వంటల్లో వాడే సాధారణ ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో చేరి రక్తనాళాలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగి గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే బీపీ కంట్రోల్లో ఉండాలంటే ముందుగా ఉప్పు వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. రుచి కోసం ఉప్పును ఎక్కువగా వాడి అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడం కంటే తగ్గించడం మేలు.