SDPT: రూ.45 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, మంత్రి వివేక్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్య శ్రేయస్సే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో పలువురు నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.