సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్‌రామ్ దేశానికి చేసిన సేవలను కొనియాడుతూ,ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.