అన్నమయ్య: గాలివీడు పీహెచ్సీని కలెక్టర్ నిశాంత్ కుమార్ తనిఖీ చేసి, సిబ్బంది గైర్హాజరు, మందుల నిల్వ, పరిశుభ్రతలో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలు మెరుగుపరచాలని ఆదేశించారు. లేబర్ రూమ్లో అత్యవసర మందులు సక్రమంగా లేవని గుర్తించి, వెంటనే అందుబాటులో ఉంచాలని సూచించారు. గ్రామీణులకు నాణ్యమైన వైద్య సేవలు ప్రాధాన్యమని తెలిపారు.