PPM: గవరమ్మపేట, ఎరుకులపేట, పెదమేరంగి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అరటి తోటల వద్ద ఇవి తిరుగుతున్నాయని గుర్తించారు. దీంతో సమీప గ్రామాల రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ఏనుగులను కవ్వించే చర్యలకు పాల్పడకూడదని హెచ్చరించారు.