TG: హైదరాబాద్లో మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కానీ, ఇళ్లు కూల్చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. మూసీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వెల్లడించారు. కాగా, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ పోరుబాట కార్యక్రమాన్ని తలసాని జెండా ఊపి ప్రారంభించారు.