నితేష్ తివారీ ‘రామాయణ’ ఓటీటీ డీల్ గురించి ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. రెండు భాగాల డిజిటల్ హక్కుల కోసం ఓ సంస్థ రూ.1000 కోట్లు ఆఫర్ చేయగా, నిర్మాత నమిత్ మల్హోత్రా దాన్ని తిరస్కరించారట. ‘ధురంధర్’ వ్యూహంతో మొదటి భాగం విడుదలయ్యాక, దాని సక్సెస్‌ను బట్టి రెండో పార్ట్ డీల్ కుదుర్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీ బిజినెస్ హాట్ టాపిక్‌గా మారింది.