VKB: బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామచందర్ పిలుపునిచ్చారు. శనివారం VKBలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ, ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.