AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని రీక్రియేషన్ క్లబ్లో ఓ జింక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిరుతపులి బారినపడి చనిపోయి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు.. జింక ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా మరణించింది? ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.