AP: TDP గీత దాటి ప్రవర్తించినవారని ఇక భరించేది లేదని ఆ పార్టీ సుప్రిమో, CM చంద్రబాబు స్పష్టంచేశారు. ఇటీవల నరసరావుపేట SP కార్యాలయంలో రచ్చపై MLA అరవింద్ బాబు ఇచ్చిన వివరణపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఇకపై సస్పెండ్ చేయడమేనని తేల్చి చెప్పారు. నాయకులంతా క్రమశిక్షణతో హుందాగా నడుచుకోవాలని సూచించారు.