PDPL: రామగుండం తహశీల్దార్ శ్రీపాద ఈశ్వర్ ఇటీవల బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం ఈ సీటు ఖాళీగా ఉంది. దీంతో ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న కిందిస్థాయి అధికారులతో రెవెన్యూ సేవలు అందడం లేదని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులకు కులం, నివాసం సర్టిఫికెట్లతో పాటు కీలకమైన రిజిస్ట్రేషన్లకు తహశీల్దార్ అవసరం ఉండగా, ఆయన బదిలీ కావడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.