MBNR: రాష్ట్రంలో అత్యధిక బీసీ జనాభాకు అన్యాయం జరుగుతోందని బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు తాయప్ప అన్నారు. ఆదివారం పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద చలో గాంధీ భవనం ఎదురుగా గోడపత్రికలు ఆవిష్కరించి, బీసీ యువతకు ఉద్యోగాలు రాకపోవడం, నోటిఫికేషన్లు వచ్చినప్పటికీ ఫలితం లేదని తెలిపారు. ముదిరాజులను బీసీ డీ నుండి బీసీ ఏ వరకు కలపాలని హోరాహోరీగా డిమాండ్ చేశారు.