నెల్లూరు రూరల్ 37వ డివిజన్ క్రాంతి నగర్లో రూ.కోటితో జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు సహకారంతో వందల కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జాతరలాగా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.