HYD: బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని నాచారం డివిజన్ రాఘవేంద్ర నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. అనంతరం బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎప్పటికీ మరువలేమని ఆయన కొనియాడారు.