JN: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా విమర్శించారు. JN జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. డొక్కు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప రాష్ట్రంలో మరేమీ చేయలేదని మండిపడ్డారు. PM నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రశాంతంగా అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతోందని కొనియాడారు.