HYD: సికింద్రాబాద్ పరిధిలోని సౌత్ లాలాగూడ బాప్టిస్ట్ చర్చిలో ఈస్టర్ వేడుకలు నిర్వహించారు. ఈస్టర్ వేడుకలకు పాస్టర్ అనిల్ కుమార్ హాజరై విశ్వాసులకు తన సందేశాన్ని అందించారు. ప్రార్థనల అనంతరం ప్రత్యేక గీతాలు, భక్తి కీర్తనలు ఆలపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ప్రభావవంతంగా మార్చారు. వారు మాట్లాడుతూ.. ఈ వేడుకలు భక్తుల్లో ఆనందం, ఐక్యతను పెంపొందించాయన్నారు.