GDWL: రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా మూడు బండ్ల గిరక పోటీలు వైభవంగా జరిగాయి. ఈ క్రీడా పోటీలను గ్రామ సర్పంచ్ బేబీ సునీల్ ప్రారంభించారు. దాతలు విజయ్ భాస్కర్ రెడ్డి, రవి రెడ్డి రూ. 10 వేలు, సర్పంచ్ రూ. 5 వేలు, రమణ బ్రదర్స్ రూ. 3 వేల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు.