HNK: కాకతీయ యూనివర్సిటీ కళాశాల వెనుక ఉన్న SRSP కాలువలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి భూక్య వాసు ఆదివారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న KU CI ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.