HYD: గోల్కొండ తారామతిలోని ఓ రిసార్టులో నిన్న జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు, నార్కోటిక్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. 35 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. అరెస్ట్ అయిన వారిలో ఓ బాలీవుడ్ నటుడు, మోడల్, వ్యాపారులు ఉన్నట్లు ఈగల్ టీమ్ తెలిపింది. ‘మోర్ దెన్ ఫ్రెండ్స్’ పేరుతో అంతర్జాతీయ డీజే పార్టీ నిర్వహించినట్లు చెప్పింది.