NZB: డిచ్పల్లిలోని బెటాలియన్లో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ నేతృత్వంలో అధికారులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దళితుల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం బాబూజీ చేసిన పోరాటంమరువలేనిదని కమాండెంట్ కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను అనుసరించి సేవాభావంతో పనిచేయాలన్నారు.