BDK: పాల్వంచ పరిధిలోని గుడిపాడు పేటచెరువులో పేకాట స్థావరంపై ఆదివారం టాస్క్ ఫోర్సు పోలీసులు దాడులు చేశారు. పేట చెరువులో పేకాడుతున్న ఆరుగురుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 13,180 నగదు, 3 ద్విచక్ర వాహనాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్టు చేసిన ఆరుగురిని పాల్వంచ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు.