అనిల్ రావిపూడి హీరోగా సినిమా నిర్మించేందుకు తాను సిద్ధమని నిర్మాత దిల్ రాజు అన్నాడు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనిపై అదే వేదికపై స్పందించిన అనిల్.. దిల్ రాజు ఆఫర్ బాగుందని, అయితే కోలీవుడ్ నటుడు ప్రదీప్ హీరోగా, దిల్ రాజు నిర్మాతగా తాను ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని సరదాగా బదులిచ్చాడు.