NZB: మెండోర మండలంలోని సోన్ పేట్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల పిండి మధు, సెల్ ఫోన్ కొనివ్వలేదనే మనస్థాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5 గంటలకు మృతి చెందాడు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెండోర ఎస్సై సుహాసిని తెలిపారు.