GDWL: ప్రధాన ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య ఖండించారు. ఆయన గద్వాలో మాట్లాడుతూ.. పోలీసులు విఫలమయ్యారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భద్రతా పరిస్థితులు దిగజారినట్లు తెలిపారు. భవిష్యత్తులో కఠిన భద్రతా చర్యలు, దాడిలో పాల్పడిన వారిపై గట్టి చర్యలు అవసరమని డిమాండ్ చేశారు.