GDWL: మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామ శివారులోని మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి చెందిన భూములు ఆక్రమణకు గురయ్యాయని గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పలు సర్వే నంబర్లలో ఉన్న వందల ఎకరాల భూములను కొందరు అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు. భూములను రక్షించి చర్యలు తీసుకోవాలని కోరారు.