NRPT: నారాయణపేట మండలం బసిరెడ్డి పల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చిన్నారి హత్య కేసులో అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం. అత్యా చారం, హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు బృందాలుగా ఏర్పడి అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు చేస్తున్నారు.