PLD: సమానత్వం–న్యాయం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని మాచర్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పార్క్ సెంటర్లోని ఆయన విగ్రహానికి మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.