NGKL: నాగర్ కర్నూలులో BRSకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కౌన్సిలర్ కొత్త రేణుక ప్రవీణ్ తన అనుచరులతో కాంగ్రెస్లో చేరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వారిని ఆహ్వానించారు. సుమారు 30 యువకులు కూడా పార్టీలో చేరారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.