SRCL: వేములవాడలోని తైబజార్ వసూళ్లు జాతర గ్రౌండ్ వద్ద ఉన్న మున్సిపల్ షాపునకు బహిరంగ వేలం పాటను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు వైస్ ఛైర్మన్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ వేలం ప్రక్రియ జరిగింది. తైబజార్ వేలంలో మొత్తం 8 మంది పోటీదారులు పాల్గొనగా, సామల శివాని అత్యధికంగా రూ.21,11,632కు దక్కించుకున్నారు.