WGL: నగరంలోని బస్టాండ్ సెంటర్లో యూత్ ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో 34వ ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటి పొదుపుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సోసైటీ రాష్ట్ర అధ్యక్షులు కోడిమాల శ్రీనివాసరావు, పర్యావరణవేత్త ప్రొఫెసర్ రతన్ సింగ్ ఠాగూర్ పాల్గొని మంచినీటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ ఏడాది “నీరు-లింగ సమానత్వం” అనే థీమ్‌తో ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.