సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ల ధాటికి పవర్ ప్లే ముగిసేసరికి SRH 3 వికెట్లు కోల్పోయి కేవలం 22 పరుగులు మాత్రమే చేసింది. ఇది IPL చరిత్రలో సన్‌రైజర్స్‌కు రెండో అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం. గతంలో 2022లో రాజస్థాన్ రాయల్స్‌పై 14/3 స్కోర్ చేయడమే ఇప్పటికీ అతి తక్కువ స్కోర్‌గా ఉంది.