మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమా నైజాం పంపిణీ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ 30న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.