SRD: కంది మండలం కావంపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పనుల్లో ఉన్న టిప్పర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక నుంచి వస్తున్న డీసీఎం దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ సూరజ్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన 108 సిబ్బంది క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి, చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.